Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ.. ఐక్యరాజ్యసమతి అంబాసిడర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా పేజీ ద్వారా తెలిపారు. ఐరాసకు చెందిన శరణార్థులు ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ కు గత 20 ఏండ్లగా ఆమె అంబాసిడర్‌గా చేస్తున్నారు. ప్రపంచ ప్రజల కోసం ఐరాస ఎన్నో చేసిందని, ఆ కార్యక్రమాలపై తనకు విశ్వాసం ఉందని, ఎమర్జెన్సీ సహాయక చర్యల్లో ఐరాస సేవలను అనిర్వచనీయమని ఆమె అభివర్ణించారు. సంక్షోభాల్లో చిక్కుకున్న వారి కోసం కొత్త సంస్థలతో కలిసి పనిచేయనున్నట్టు ఆమె ఇన్‌స్టా తెలిపారు.