Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెంచామని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో మెడికోవర్ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ హబ్‌గా ఎదిగిందన్నారు. అత్యధిక ట్రాన్స్‌ప్లాంటేషన్లు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయన్నాని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు దవాఖానలు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఈ పథకం కింద అత్యధికంగా రూ.10 అందిస్తున్నామని, పేద ప్రజల వైద్యం కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ హాస్పిటళ్లు పేదలకు మెరుగైన వైద్యం అదించాలన్నారు.