Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ విజయవాడ: ప్రపంచ వ్యాప్తింగా శుక్రవారం విడుదలైన అవతార్-2 ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూస్తూ కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడు శ్రీనుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని తెలిపారు.