Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: భార్యతో గొడవ పడి భర్త తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. గతకొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీ ప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పూజను కలిసేందుకు మాన్ సింగ్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కపోద్రిక్తుడైన మాన్ సింగ్ తన రెండేళ్ల కుమారుడిని బాల్కనిలోంచి కిందుకుతోసేశాడు. అనంతరం తాను కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు, మాన్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు మాన్ సింగ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.