Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ‘కూ’ ఖాతాను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసింది. వినియోగదారుల ప్రశ్నలను ఫీల్డ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ట్విట్టర్ హ్యాండిల్ @kooeminence శుక్రవారం నిలిపివేశారు. దీనికన్నా ముందు న్యూయార్క్ టైమ్స్, సీఎన్‌ఎన్, వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు అనేక మంది ప్రముఖ గ్లోబల్ జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. మార్కెట్లో కూ ఇస్తున్న పోటీ కారణంగా ఆగ్రహంతో వారి ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసినట్లు పలువురు నమ్ముతున్నారు. కూ ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాంగా అవతరించిందని, ప్రస్తుతం ‘కూ’ వినియోగదారుల సంఖ్య 5 కోట్లు దాటిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిద్వాత్కా గత నెలలో వెల్లడించారు.