Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ సిడ్నీ: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టు ఆట తీరు అత్యంత దారుణం. టీ20 మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. సిడ్నీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చింది. టీ20 చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోర్‌గా నమోదు అయ్యింది. 140 పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసేందుకు బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ జట్టు.. శరవేగంగా వికెట్లను కోల్పోయింది. కేవలం ఆరు ఓవర్లలో సిడ్నీ జట్టు కుప్పకూలిపోయింది. అడిలైడ్ స్ట్రయికర్ష్ బౌలర్ హెన్రీ థార్న్టన్ మూడు పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.