Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ మండల అధ్యక్షులు అజయ్ కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమూహం వద్ద సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలని బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కే.అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలంటూ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ 163వ జాతీయ రహదారి వెంట ఉన్న మండల తహసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మహిళ సమాఖ్య కార్యాలయం, ప్రాథమిక వైద్య కేంద్రం, స్థానిక వ్యవసాయ మార్కెట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, మీసేవ కేంద్రం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇంకా రెండు వసతి గృహాలు మరియు నిర్మాణ దశలో ఉన్న దేవాలయం ఇన్ని ప్రదేశాలు ఒకేచోట ఉన్నాయి ఇక్కడ బస్సు ఎక్కాదన్న దిగాలన్న ఎదురుచూస్తున్న ప్రజలకు అధికారులకు అందుబాటులో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సులబ్ కాంప్లెక్స్ కానీ మరుగుదొడ్లు కానీ నిర్మించినట్లయితే అధికారులు ప్రజల సమస్యకు పరిష్కారం జరుగుతుందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు సూచించారు. మండల కేంద్రంలో విస్తీర్ణంలో పెద్దగా ఉన్నందున అధికారులు చొరవ తీసుకొని సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిన్ని. పసరా సెక్టార్ అధ్యక్షులు సంఘీ శివ, మల్యాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.