Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. దేశంలో 23 రాష్ట్రాల్లో 127 పరీక్ష కేంద్రాల్లో క్లాట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్ లా యూనివర్సిటీలు, 77 అనుబంధ కాలేజీల్లోని లా కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. కన్సార్షియమ్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (NLUs) ఏటా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది.