Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: అతనో బిచ్చగాడు. చెవులు వినపడవు. రోడ్లపై అడుక్కుంటూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సడెన్‌గా అతనికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన జేబుల్లో ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా అని చూస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి. అన్నీ రూ.2 వేల నోట్లే.. అది చూసి నోరు వెళ్లబెట్టడం ప్రజల వంతయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో జరిగింది. షరీఫ్ బౌన్క్ అనే 50 ఏండ్ల వ్యక్తి గోరఖ్‌పూర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఆయనకు చెవులు వినపడవు. రోజూలానే శనివారం వీధుల్లో తిరుగుతుండగా అతడిని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో కాలు విరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అతని వద్ద గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. అయితే ఐడీ కార్డులు కాదుకానీ.. వారికి రూ.2 వేల నోట్ల కట్టలు దొరికాయి. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అన్నీ లెక్కబెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు ఉన్నాయి. మొత్తం రూ.2 వేల నోట్లేనని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించామని, కాలు విరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ డబ్బు తమ వద్దే ఉన్నదని తెలిపారు.