Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట: హుజూర్నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన సిబ్బంది వారిని దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా,..శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు ఇచ్చి వెళ్లారు. అయితే..సదరు విద్యార్థి తనతో పాటు అతని స్నేహితులైన మరో పదిమంది విద్యార్థులకు ఇచ్చిన ఖర్జూర పండ్లు ఇచ్చింది. పండ్లు తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడండంతోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు.