Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోయిడా: గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు బస్సుల్లోని పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే నాలెడ్జ్ పార్క్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నదని పోలీసులు చెప్పారు.