Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా 150కు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్ చేసింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్ కేవలం 52 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది.