Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని బాకారంలో దారుణం జరిగింది. ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా కుమార్తె యాస్మిన్ ఉన్నిసా (17) వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి మహమ్మద్ తౌ ఫి అలియాస్ సాదిక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితుడు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.