Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉప్పల్ నుంచి కోకాపేట వరకు ప్రత్యేక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును నడపనున్నారు. సోమవారం మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి ప్రారంభించనున్నారు. ఉప్పల్ నుంచి రామాంతాపూర్, అంబర్‌పేట 6 నంబర్, లక్డీకాపూల్, మెహిదీపట్నంఎక్స్ రోడ్, గచ్చిబౌలి మీదుగా ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకోసం మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును నడుపుతున్నామన్నారు. ఉదయం 7.30 గంటలకు ఉప్పల్ నుంచి కోకాపేటకు... సాయంత్రం 6 గంటలకు కోకాపేట నుంచి ఉప్పల్‌కు అందుబాటులో ఉండనుంది. ఉప్పల్ నుంచి కోకాపేట వరకు చార్జీ రూ. 90, రామాంతాపూర్ రూ.70, అంబర్‌పేట 6 నంబర్ రూ.70, లకికపూల్/మెహిదీపట్నంఎక్స్ రోడ్ రూ.65, గచ్చిబౌలి కోకాపేటకు రూ. 45 చార్జీలు నిర్ణయించినట్టు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.