Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని ఆలయానికి ఇరువైపుల ఉన్న పాత దుకాణాలను తొలగించడానికి దేవస్థానం అధికారులు రంగం సిద్ధం చేశారు. దుకాణాలను తొలగించడానికి జేసీబీ యంత్రం లారీ, ట్రాక్టర్లను సిద్ధం చేశారు. దుకాణాల వద్ద బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఇరు వైపులా ఉన్న పాత దుకాణాలను కొత్తగా నిర్మించిన లలితాంబింకా సముదాయంలోకి తరలించాలని దేవస్థానం అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ లోపు దుకాణాలను తరలించాలని వ్యాపారులకు సూచించారు. గడువు ముగిసినప్పటికీ వ్యాపారులు తమ పాత దుకాణాలను తరలించలేదు. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 3వ తేదీన మొత్తం 125 మంది వ్యాపారులకు లక్కీ డిప్ నిర్వహించి లలితాంబికా సముదాయంలో దుకాణాలు కేటాయించారు. కొత్త దుకాణాలు కేటాయించినప్పటికీ వ్యాపారులు తమ పాత దుకాణాలను తొలగించకుండా ఉండటంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ రోజు దుకాణాలను తొలగించడానికి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.