Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు యాత్ర చేయనున్నారు. రెండు నెలలు పాటు రేవంత్ ‘హాత్ మే హాత్ జోడో’ పేరిట పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ పాదయాత్రలో సీనియర్ నేతలు పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.