Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: శ్రీశైలం దేవాలయానికి ఇరువైపుల ఉన్న దుకాణాల తొలగింపును నిరసిస్తూ వ్యాపారులు ఆదివారం నిరసన తెలియజేశారు. ఆలయం వద్ద ఉన్న పాత దుకాణాలను కొత్తగా నిర్మించిన లలితాంబింకా సముదాయంలోకి తరలించాలని అధికారులు వ్యాపారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వ్యాపారులకు కేటాయించిన దుకాణాల్లోకి ఈనెల 15 వ తేదీలోపు మారిపోవాలని సూచించారు.
ఇందులో భాగంగా ఆదివారం అధికారులు జేసీబీ యంత్రాలు, లారీ, ట్రాక్టర్లతో పాత భవనాల సముదాయల వద్దకు తీసుకురాగా వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారివారి దుకాణాల ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈనెల 3వ తేదీన మొత్తం 125 మంది వ్యాపారులకు లక్కీ డిప్ నిర్వహించి లలితాంబికా సముదాయంలో దుకాణాలు కేటాయించారు. అయితే కొత్త సముదాయంలో వ్యాపారాలు నిర్వహించడానికి వసతులు లేవని వ్యాపారులు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.