Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. ఈ తరుణంలో రాజేశ్వరరావు మాట్లాడుతూ మొదటి నుంచి వైసీపీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు.
కష్టపడిన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, జైలుకు పంపుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మూడున్నరేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరానని, ఆయన ఆదేశానుసారం నడుచుకుంటానని బొంతు రాజేశ్వరరావు వ్యక్తం చేశారు.