Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జన్నారావు ఘోరం చోటుచేసుకుంది. వేణు అనే వ్యక్తిని భార్య హత్య చేయించింది. హత్య కేసును పోలీసులు ఛేదించారు. దినిని చేధించిన పోలిసులు భార్య సుస్మితనే నిందితురాలిగా తేల్చారు. డబ్బులు ఇచ్చి భర్తను భార్య హత్య చేయించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 30న వేణును అతని భార్య సుష్మిత సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది.
అనంతరం పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో మృతదేహాన్ని దుండగులు పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏమీ ఎరగనట్టు తన భర్త కనిపించడం లేదంటూ సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 71 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. సుఫారీ గ్యాంగ్‌కు రూ. 4 లక్షలు ఇచ్చి హత్య చేయించగా, సుష్మితతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.