Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో ఓ 30 ఏండ్ల యువకుడు తన మారుతి బ్రీజా కారులో వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కొంచెం దూరంలో కారును ఆపిన యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు.
గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 10, 4 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కాగా, 6 ఏండ్ల వయసున్న మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను ప్రతాప్‌నగర్‌కు చెందిన గజేందర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే అంతకు ముందు కూడా గజేందర్ వేగంగా కారు నడిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెల్లగా నడపాలని హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోలేదన్నారు.