Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలోని బోరియో పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. దిల్దార్ అన్సారీ అనే యువకుడు ఓ యువతితో గత రెండేండ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె రెండో భార్య. సహజీవనంతో సరిపెట్టుకుందామని అన్సారీ అనుకున్నాడు. కానీ అది పెళ్లి దాకా దారి తీయడంతో ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు.
దీంతో శనివారం ఆమెను చంపి, శరీర భాగాలను 50 ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ భాగాలను పలు ప్రదేశాల్లో పడేశాడు. ఈ హత్య కేసులో తాను దొరకద్దనే ఉద్దేశంతో తన భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ అంగన్‌వాడీ వద్ద మహిళా మృతదేహం ఛిద్రమై ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సాహెబ్‌గంజ్ ఎస్పీ రంగంలోకి దిగారు.
ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో 12 భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలుపగా, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లోతుగా విచారించగా చేసిన నేరాన్ని భర్త అంగీకరించాడు. మృతురాలిని రుబీకా పహదీన్‌గా పోలీసులు గుర్తించారు. పహదీన్ మిగతా శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.