Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం 6వ సమావేశానికి హాజరయ్యారు. అంతే కాకుండా విజయనగరం జిల్లా రాజాంలో జీఎంఆర్ సంస్థలను కూడా నారాయణమూర్తి సందర్శించారు. ఉపాధి శిక్షణ కేంద్రం, ఆస్పత్రి, విద్యాసంస్థలను పరిశీలించారు. జీఎంఆర్ ఐటీ కళాశాల రజతోత్సవాల్లోనూ పాల్గొన్నారు.
ఈ తరుణంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడారు. యువత ఉన్నతికి విద్యార్థి దశే పునాదని, మంచి ఆలోచనలు, పోటీతత్వంతో విద్యార్థులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శక్తిసామర్థ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు అందుకోగలరని సూచించారు. యువత శక్తిసామర్థ్యాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.