Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం ఓ ఎనిమిది మంది క్రూరమృగాల్లా విరుచుకుపడి 16 ఏండ్ల అమ్మాయిపై 12 గంటల పాటు లైంగికదాడి చేశారు. పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ 16 ఏండ్ల అమ్మాయికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశంలోని ఓ పాత బంగ్లాలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఓ 8 మంది యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు.మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు తనపై విరుచుకుపడ్డారని, వారి దాడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు పాల్పడ్డ 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.