Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో అవినీతికి తావులేని పాలన అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మొత్తం లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తామని, లోకాయుక్త కింద ఐదుగురు రిటైర్డ్ జడ్జిలుంటారని ప్రకటించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం కూడా ఇందులో భాగంగా ఉంటుందన్నారు. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే నేతృత్వంలోని కమిటీ లోకాయుక్తను ప్రవేశపెట్టే విషయంపై సమర్పించిన నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకొస్తామన్నారు.