Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైసీపీ, టీడీపీ గూండాల నుంచి ఏపీని కాపాడాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినట్టు రుజువైందని, వైసీపీ గూండాలు, టీడీపీ గూండాల మధ్య దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఇలాంటి వాతావరణంలో ఉండలేక కియా వంటి సంస్థలు వెళ్లిపోయే పరిస్థితి నెలకొందన్నారు. పలు జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా తనను వందల మంది కలిశారని, తమకు బుద్ధి వచ్చిందని ఇప్పుడు చెబుతున్నారని వెల్లడించారు.
2014లో చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తామన్నారని, ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తామన్నారని, కానీ సీమాంధ్రను చీమల ఆంధ్రగా మార్చేశారని, ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని కేఏ పాల్ మండిపడ్డారు.