Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్‌లో సొరంగమార్గంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి సొరంగం పేలుడులో మహిళలు, పిల్లలు సహా కనీసం 19 మంది మరణించారని పర్వాన్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి సెడ్ హిమతుల్లా షమీమ్ తెలిపారు. శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు కారణమేమిటనేది వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయాయని, సొరంగాన్ని క్లియర్ చేసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, మిగిలిన వారంతా తీవ్రంగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నారని వైద్య అధికారులు తెలిపారు.