Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్‌కు చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్-2022 టైటిల్‌ను గెలుచుకుంది. 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కిరీటాన్ని సొంతం చేసుకోవడం విశేషం. శనివారం వెస్ట్‌గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్ సర్గమ్ కౌశల్‌కు కిరీటాన్ని బహూకరించింది. ఈ పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన వనితలు రన్నరప్స్‌గా నిలిచారు.
దాదాపు 21 సంవత్సరాల భారత్ నుంచి సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్‌గా ఎంపికైనట్లు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. అయితే, టైటిల్‌ను సాధించడంపై సర్గమ్ కౌశల్ హర్షం వ్యక్తం చేసింది. 21-22 సంవత్సరాల తర్వాత భారత్ తరఫున మళ్లీ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. లవ్ యూ ఇండియా లవ్ యూ వరల్డ్ అంటూ సంతోషాన్ని పంచుకున్నారు.