Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వీధుల్లో షరీఫ్ బౌన్క్ (50) అనే వ్యక్తి వీధుల్లో బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. చెవిటివాటైన సదరు వ్యక్తి శనివారం (డిసెంబర్ 17) నాడు కూడా భిక్షాటన చేస్తుండగా ఓ బైక్ అతన్ని ఢీకొట్టింది. దీంతో కాలు విరిగి, బాధతో అల్లాడుతున్న బాధితుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. దీంతో ఐడీ కార్డులకు బదులు, రూ.2 వేల నోట్లు దొరికాయి. ఆ డబ్బంతా లెక్కపెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు వరకు ఉన్నట్లు తేలింది. భిక్షటన చేసే వ్యక్తి వద్ద అన్నీ రూ.2 వేల నోట్లు ఉండటం విశేషం. అనంతరం డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుని సమీపంలోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి చికిత్స నమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.