Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హర్యానాలోని యమునా నగర్‌లో భారీ ప్రమాదం తప్పింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అంబాలా-యమునానగర్-సహరన్‌పూర్ జాతీయ రహదారిపై ఒకదానికొక్కటి సుమారు 15 వాహనాలు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాక చర్యలు చేపట్టారు. కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీపంలోని దవాఖానలకు పంపించారు. పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనబడకపోవండంతో హైవేపై వెళ్తున్న 10 నుంచి 15 కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో జాతీయర రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించామన్నారు. వాహనాలను ప్రత్యామ్నా రూట్లలో మళ్లించారు.