Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి పెద్దమొత్తంలో అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. దీంతో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆధ్వర్యంలో ఒడిశాకు వెళ్లిన అబ్కారీ పోలీసులు టాంగీలోని మద్యం తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా అక్రమ మద్యం, ముడిసరుకు, లేబుళ్లను సీజ్ చేశారు. అక్రమ మద్యం విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని, రూ.కోటికి పైగా విలువైన మద్యం ప్యాకింగ్ చేసే యంత్రాలను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో నల్లగొండ, చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా అక్రమద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఒడిశా నుంచి అది సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఈనేపథ్యంలో ఒడిశాలోని డిస్టిలరీలో అధికారులు సోదాలు నిర్వహించారు.