Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ను తాలిబాన్ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాక్ వాయవ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ బన్ను కంటోన్‌మెంట్‌లోని పోలీస్ స్టేషన్‌పై తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ ఫైటర్లు దాడి చేశారని, దానిని స్వాధీనం చేసుకున్నారని పాక్ పోలీసులు వెల్లడించారు. స్టేషన్‌లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారని చెప్పారు. అనంతరం తీవ్రవాద నిరోధక శాఖకు చెందిన భద్రతా సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారన్నారు. అయితే బయటి నుంచి వచ్చిన తీవ్రవాదులు దాడి చేశారా లేదా లోపల ఖైదీలుగా ఉన్నవారే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారా అనే స్పష్టంగా తెలియరాలేదన్నారు. ప్రస్తుతం పాక్ సైన్యం పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు.