Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ భద్రాచలంలో చేపట్టిన బంద్‌లో ఎమ్మెల్యే పొదేం వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భద్రాచలం ప్రతిష్ట దెబ్బ తిసేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. భద్రాచలం పంచాయితీని మూడు పంచాయితీలుగా విభజన చేసిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో కలిసిన ఐదు విలీన గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపడంలో సీఎం కేసీఅర్ విఫలమయ్యారన్నారు. భద్రాచలంను మేజర్ పంచాయతీగానే కొనసాగించాలన్నారు. భద్రాచలం పట్ల సీఎం కేసీఆర్‌కు చిన్న చూపు అని ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు చేశారు.