Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే దేవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రాజధాని పారిస్, నైస్, లియోన్ వంటి అనేక నగరాల్లో భారీగా జనాలు వీధుల్లోకి వచ్చారు. వాహనాలు అడ్డుకుంటూ వీరంగం సృష్టించారు. అయితే శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పటాకులు కాల్చారు. దీంతో పలు చోట్ల ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆదివారం జరిగిన సాకర్ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) కెరీర్ చివరి మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతో రెండు గోల్స్ కొడితే.. ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌కు పరిమితం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చారు. అందులోనూ ముందంజలో నిలిచిన అర్జెంటీనా గోల్ కొట్టడంతో ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఎంబాపే అద్వితీయ రీతిలో గోల్ నమోదు చేయడంతో మరోసారి 3-3తో స్కోర్లు సమమ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా.. అందులో అర్జెంటీనా ముందంజ వేసింది. దీంతో 4-3 తేడాతో ఫ్రాన్స్ ఓడిపోయింది.