Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లో శాంసంగ్ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్ గెలాక్సీ ఏ04, గెలాక్సీ ఏ04ఈలను లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో మల్టీటాస్కింగ్ చేపట్టే స్మార్ట్‌ఫోన్‌ల కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ శాంసంగ్ ఈ డివైజ్‌లను లాంఛ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రూ .9999 నుంచి అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ ఏ04, గెలాక్సీ ఏ04ఈ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్ ఇండియా ఈస్టోర్, అధికారిక రిటైల్ స్టోర్స్‌లో డిసెంబర్ 20 నుంచి లభిస్తాయి. మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం కలిగిన గెలాక్సీ ఏ04 ధర కొంచెం అధికంగా ఉంది. గెలాక్సీ ఏ04 గ్రీన్, కాపర్, బ్లాక్ కలర్స్‌లో, గెలాక్సీ ఏ04ఈ లైట్ బ్లూ, కాపర్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ04 2022 ఆగస్ట్‌లో, గెలాక్సీ ఏ04ఈ ఈ ఏడాది అక్టోబర్‌లో లాంఛ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.5 ఇంచ్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, ర్యాం ప్లస్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకొచ్చాయి. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో బడ్జెట్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.