Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలో కొనసాగిస్తున్న నిరసనలు మూడోరోజుకు చేరుకున్నాయి. రాంలీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కిసాన్ గర్జన’ సభకు అమరావతి రైతులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఈ సభలో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన విధానం.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అన్యాయాన్ని అమరావతి ఐకాస నేతలు ఈ సభలో వివరించనున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలవాలని భారతీయ కిసాన్ సంఘ్ నేతలను కోరనున్నారు.