Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ తరుణంలో వైద్యులు, పురప్రముఖులను ఉద్దేశించిన మాట్లాడారు. ములుగులో హంస హోమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధన దవాఖానను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఆయుష్‌కు మంచి భవిష్యత్ ఉన్నదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకు ప్రాధాన్యం పెరుగుతున్నదన్నారు.
నేచర్ క్యూర్ దవాఖాన కోసం రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో మాదిరిగానే వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో కూడా 50 పడకలతో కూడిన ఆయుష్ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.