Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రపంచ కప్ కల సాకారం చేసుకున్నాడు. ఆదివారం లుసైల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్ లపై ఫ్రాన్స్‌ను ఓడించడంతో లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అభిమానులకు మెస్సీ భావోద్వేగ లేఖ రాశాడు.
ప్రపంచ చాంపియన్స్ ఈ మాట అనిపించుకోవాలని నేను చాలా సార్లు కల కన్నాను. ఇప్పుడు ప్రపంచ చాంపియన్స్ అయ్యామంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కుటుంబ సభ్యులకు, నన్నుఆదరిస్తున్న వారందరికీ, మమ్మల్ని నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. అర్జెంటీనీయన్లు ఐక్యమత్యంతో ఉన్నప్పుడు, అంతా కలిసి పోరాడినప్పుడు మనం అనుకున్నది సాధించగలమని మేం మరోసారి నిరూపించాము. ఈ విజయం వ్యక్తిత్వాలకు అతీతమైన మా జట్టు మొత్తానికి చెందుతుంది. ఇది మా అందరి, అర్జెంటీనా ప్రజలందరి కల. దాని కోసం పోరాడాం. అనుకున్నది సాధించాం అంటూ మెస్సీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.