Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మేఘాలయా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు డాక్టర్ ఎం అంపరీన్ లింగ్డో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి సంబంధిత రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.
ఈ తరుణంలో రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయడం కోసం తనకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, ఈస్ట్ షిల్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రజల కోసం పనిచేయడం కాంగ్రెస్ పార్టీవల్లే తనకు సాధ్యమైందని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా బాగాలేదని, స్థానిక నేతలు పార్టీని భ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అ క్రమంలోనే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కోన్నారు.