Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భువనగిరి పట్టణానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత అంటార్కిటికా ఖండంలోని అత్యంత ఎత్తైన విన్సన్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. దీనిని ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ఇండియాతో కలిసి అంటార్కిటికాలోకి అంతర్జాతీయ యాత్ర బృందంలో భాగమయ్యారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎనిమిదో ఎత్తైన పర్వతమైన మౌంట్ మనస్లును కూడా అన్విత అధిరోహించారు. ఫిబ్రవరి 2021 లో లడఖ్‌లోని ఖాడే పర్వతం, జనవరి 2021 లో కిలిమంజారో పర్వతం, డిసెంబర్ 2021 లో ఎల్బ్రస్ పర్వతం, మే 2022లో ఎవరెస్ట్ పర్వతం, సెప్టెంబర్ 2022 న మౌంట్ మనస్లూ పర్వతాన్ని అధిరోహించారు. మౌంట్ మనస్లూ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళగా అన్విత చరిత్ర సృష్టించడం విశేషం. అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించడం పట్ల అన్విత సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పర్వతం అధిరోహణకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో క్లైంబింగ్ చేయడం ఛాలేంజింగ్‌తో కూడుకున్నదని అన్నారు.