Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నిర్వహించే కాలేజ్‌పై సీబీఐ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. బెంగళూర్‌లోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ పేరుతో నడుస్తున్న విద్యా సంస్ధకు డీకే శివకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దాడుల సందర్భంగా కాలేజ్ నిర్వాహకులను దర్యాప్తు ఏజెన్సీ అధికారులు ప్రశ్నించారు. శివకుమార్ కూతురు డీకేఎస్ ఐశ్వర్య కాలేజ్ ట్రస్టీ కార్యదర్శి కాగా, ఆయన భార్య కాలేజ్ ట్రస్ట్ సభ్యురాలు. మనీల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ ప్రశ్నించిన రెండు నెలల తర్వాత డీకే కాలేజ్‌పై సీబీఐ దాడులు చేపట్టడం జరిగింది.