Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో గోడలపై దేవుళ్ల ఫొటోలు అతికించడంపై నిషేధం విధించండి. దాంతో వాటిపై ప్రజులు ఉమ్మివేయకుండా, మూత్ర విసర్జన చేయకుండా చూడొచ్చని గోరంగ్ గుప్తా అనే న్యాయవాది పిటిషన్ వేశాడు. బహిరంగ ప్రదేశాల్లోని గోడల మీద దేవతల ఫొటోలు అటించడం అనేది సెక్షన్ 295 (ప్రార్థన స్థలాల పవిత్రతను దెబ్బతీయడం), సెక్షన్ 295ఏ (ఉద్దేశపూర్వకంగా అన్యమతస్తుల మనోభావాలను దెబ్బతీయడం) ఉల్లంఘన కిందకు వస్తుందని గోరంగ్ తన పిటిషన్‌లో తెలిపారు.
ఈ తరుణంలో తాజాగా ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేదు.