Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
భార్యతో చీటికిమాటికి గొడవలు కావడంతో భర్త పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రెంజల్ మండలం కల్యాపూర్ కు చెందిన ఫరీద్ 30 గత మూడు సంవత్సరాల క్రితం మండలంలోని నారాయణపూర్ కు చెందిన సబ్రిన్ బేగంతో వివాహం జరిగింది. ఇద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా నాగేపూర్ లో నివాసం ఉంటున్నారు.
కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య చీటికిమాటికి గొడవలు జరుగుతుండడంతో మనస్థాపం చెంది మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనగా 108 లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.