Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మోడీతో చర్చించిన పిచాయ్.. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. 'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పిచాయ్.. మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీతో జరిగిన ఈ గొప్ప సమావేశానికి ధన్యవాదాలు. మీ నాయకత్వంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు రావడం ఎంతో స్ఫూర్తిదాయకం. మా దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు భారత్ అధ్యక్షత వహిస్తోన్న జీ-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం అని పేర్కొంటూ ప్రధానితో భేటీ అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.