Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీల్లి: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వకంగా ప్రశ్న వేయగా దీనికి స్పందించిన, కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రాల అప్పుల వివరాలను తెలిపారు.
రాష్ట్రాల అప్పుల వివరాల ప్రకారం దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా ప్రకటించింది.