Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీహార్: పాట్నా రైల్వే జంక్షన్‌లో బాంబు పెట్టారనే సమాచారం గందరగోళం సృష్టించింది. బీహార్ రాష్ట్రంలోని పాట్నా రైల్వేస్టేషనులో బాంబు పెట్టామని ఆగంతుకుడు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులను రంగంలోకి దించారు.పాట్నా రైల్వేస్టేషనులో హైఅలర్ట్ ప్రకటించారు. బూటకపు బాంబు బెదిరింపు పాట్నా రైల్వే స్టేషన్‌లో గందరగోళానికి దారితీసింది. గాలింపులో పాట్నా పోలీసులకు ఎలాంటి బాంబు దొరికినట్లు సమాచారం అందలేదు. పోలీసులు దీనిని పుకార్లుగా పేర్కొంటూ విచారణ జరుపుతున్నారు.రైల్వేస్టేషనులో బాంబు దొరికినట్లు తమకు సమాచారం అందలేదని, ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని పాట్నా రైల్వే స్టేషన్ ఇన్‌చార్జి రంజిత్ కుమార్ తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారంతో రైల్వే ప్రయాణికులు భయాందోళనలు చెందడంతో స్టేషనులో తీవ్ర గందరగోళం ఏర్పడింది.