Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ హైదరాబాద్ రానున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించనున్న పెట్టుబడుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఆయన ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతారు. ఇద్దరు కలిసి భోజనం చేయనున్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చలు జరపనున్నారు. పంజాబ్ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయి రాజకీయాలపై మాన్ కేసీఆర్‌తో చర్చించనున్నారు. పంజాబ్‌లో కాంగ్రె్‌సను మట్టి కరిపించి అధికారాన్ని కైవసం చేసుకున్న ఆప్.. ఇటీవల జరిగిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ నేత, పంజాబ్ సీఎం మాన్; బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ నెల 24న పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ హైదరాబాద్ రానున్నారు.