Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: పోలీస్ రిక్రూమెంట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రాజేందర్ అనే అభ్యర్థి మృతి చెందాడు. డిసెంబర్ 17న 1600 మీటర్ల పరుగు తీస్తుండగా రాజేందర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలోనే నాలుగు రోజులుగా ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. నేడు రాజేందర్ చికిత్స పొందుతూ మరణించాడు. రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లా శివా తండా. కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల నిర్వహణ జరిగింది.