Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని దంకర్ ఏరియాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. దట్టమైన పొగమంచు కారణంగానే ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక బస్సు డ్రైవర్ ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు. ప్రమాదం సమయంలో బస్సులో 60 ప్రయాణికులు ఉన్నారన్నారు.