Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏరియాలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.