Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కమ్మగూడలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మట్టుబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూతగాదాలు, పాతకక్షలతోనే జార్జ్‌ను కొట్టి చంపినట్లుగా సమాచారం.